చిత్రసీమలో ఇంతకాలం బ్యాచిలర్ లైఫ్ తో ఎంజాయ్ చేసిన నటీనటులంతా..ఇప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అవుతున్నారు. ఈ మధ్య వరుసగా పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలువగా..తాజాగా టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) పెళ్లి (Marriage ) చేసుకున్నారు. తన ప్రేమికుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఈరోజు తిరుపతిలో వివాహం చేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
వాసంతి కృష్ణన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. హీరోయిన్ గా అడపా దడపా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదే తరుణంలో తాను ప్రేమించిన పవన్ తో కలిసి చెట్టపట్టాలు వేసుకుంటూ గత కొద్దీ రోజులుగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రేమించిన వ్యక్తి తో ఏడు అడుగులేసింది. వీరి వివాహ వేడుక తిరుపతిలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్యన అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. కాగా గతేడాది డిసెంబర్ 7న వీరి నిశ్చితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కాగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తిరుపతికి చెందిన వాసంతి 2019లో సిరి సిరి మువ్వలు అనే సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి సీరియల్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలాగే క్యాలీఫ్లవర్ అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. గతేడాది ‘భువన విజయం’ సినిమాలో నటించింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఇక వాసంతి పెళ్లాడిన పవన్ కళ్యాన్ కూడా నటుడే. వీరిద్దరు గతేడాది ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. నిన్న(మంగళవారం) తిరుపతిలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.
Read Also : CM Jagan : నేడు విశాఖకు సీఎం జగన్..