Site icon HashtagU Telugu

Varun Tej : వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం..డైరెక్టర్ ఎవరంటే !

Varun New Movie

Varun New Movie

గత కొంతకాలంగా సరైన హిట్ లేని వరుణ్ తేజ్ (varun Tej)…తాజాగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కబోయే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుణ్ తేజ్‌ ఇప్పటివరకు చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది. వినోదంతో పాటు ఆసక్తికరమైన హారర్ అంశాలను కలిపి రూపొందనుందని మేకర్స్ తెలిపారు. యువీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఎస్. థమన్ సంగీతాన్ని అందించనున్నారు.

Pending Employee Dues : ఉద్యోగుల్లో ఆనందం నింపిన చంద్రన్న

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ కథానాయికగా జోడి కడుతుంది. సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుంది. గతంలో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సినిమాలు అన్ని హాస్యభరితమైనవి కావడంతో, ఈ చిత్రంలో కూడా మంచి వినోదం ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే కాకుండా ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర ఎంతో కొత్తగా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉండబోతుందని చిత్ర బృందం తెలిపింది.

హిలేరియస్ అడ్వెంచరస్ మూవీ కానున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. వరుణ్ తేజ్ తన విభిన్నమైన కథాంశాలు ఎంచుకునే పద్ధతిని కొనసాగిస్తూ, కొత్త తరహా సినిమాలను ఎంచుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హారర్-కామెడీ జానర్ లో ఇండియన్, కొరియన్ కలయిక ఎలా ఉండబోతుందో చూడాలి!