Site icon HashtagU Telugu

Lavanya Tripathi : కట్టెల పొయ్యి పై మెగా కోడలి టీ మేకింగ్..

Varun Tej Wife Lavanya Tripathi Vacation Photos Gone Viral

Varun Tej Wife Lavanya Tripathi Vacation Photos Gone Viral

Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. పెళ్లి తరువాత ప్రకృతి పై ప్రేమ ఎక్కువ పెంచుకున్నట్లు కనిపిస్తుంది. ఆ మధ్య వైజాగ్ ఆర్కే బీచ్ లో ప్లాస్టిక్ ని నిర్ములిస్తూ కనిపించారు. అయితే అది తన ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ప్రమోషన్ అని చెప్పుకొచ్చారు. ఆ వెబ్ సిరీస్ లో లావణ్య.. ప్రతిదీ క్లీన్ గా ఉండాలనే ఒక OCD డిస్ ఆర్డర్ కలిగి ఉన్న పాత్రలో కనిపించారు. కాగా లావణ్య ఆ పాత్ర నుంచి ఇంకా బయటకి రానట్లు కనిపిస్తున్నారు. ఇంకా ప్రకృతిని క్లీన్ చేస్తూనే కనిపిస్తున్నారు. అది ఒక OCDలా కాకుండా, ఒక భాద్యతగా తీసుకున్నట్లు తెలుస్తుంది.

తాజాగా లావణ్య త్రిపాఠి తన స్నేహితులతో కలిసి ఎక్కడో లోయల్లోకి వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక అక్కడ వెకేషన్ ని ఎంజాయ్ చేయడంతో పాటు లావణ్య.. అక్కడ ఉన్న ప్లాస్టిక్ ని నిర్ములించే ప్రయత్నం చేసారు. అలాగే వెకేషన్ ని కూడా ప్రకృతి పద్ధతిలో ఎంజాయ్ చేస్తున్నారు. కట్టెల పొయ్యి పై టీని కాచుకుంటూ కనిపించారు. కట్టెల పొయ్యి పై టీ పెట్టి ఫ్రెండ్స్ కి తన చేతి రుచి చూపించారు. ఇక ఆ ఫోటోలను లావణ్య తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే.. చివరిగా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించిన లావణ్య మంచి విజయానే అందుకున్నారు. అయితే దీని తరువాత ఆమె చెప్పబోయే ప్రాజెక్ట్స్ పై ఎటువంటి సమాచారం లేదు. కాగా లావణ్య పెళ్లి తరువాత కూడా యాక్టింగ్ ని కొనసాగిస్తాను అంటూ గతంలోనే చెప్పుకొచ్చారు. అయితే కథల విషయంలో మాత్రం జాగ్రత్త వహిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.