Site icon HashtagU Telugu

Ram Charan: చరణ్ కి స్పెషల్ విషెస్ తెలిపిన లావణ్య త్రిపాఠి.. నెట్టింట పోస్ట్ వైరల్?

Ram Charan

Ram Charan

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మెగా అభిమానులు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్స్ రామ్ చరణ్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కొక్కరుగా చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పటివరకు తన కొడుకుకి విషెస్ తెలియజేయలేదు. ఇక మిగిలిన కుటుంబసభ్యుల విషయానికి వస్తే.. మొదటిగా బాబాయ్ పవన్ నుంచి విషెస్ వచ్చాయి.

తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పవన్ కొడుకుని పొగడ్తలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ స్పెషల్ వీడియో పోస్టు చేస్తూ విషెస్ తెలియజేసారు. ఇక చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, సుష్మిత బర్త్ డే విషెస్ ని తెలిపారు. ఈ క్రమంలోనే మెగావారి కొత్త కోడలు లావణ్య త్రిపాఠి కూడా చరణ్ బావ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
తన ఇన్‌స్టాలో చరణ్ తో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. మరో గొప్ప సంవత్సరం, సక్సెస్ రావాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు రామ్ చరణ్ అంటూ లావణ్య రాసుకొచ్చారు.

ఇక ఈ పిక్ ని మెగా అభిమానులు వైరల్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన భార్య కూతురుతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. కూతురు పుట్టిన తరువాత చరణ్ జరుపుకుంటున్న మొదటి బర్త్ డే కావడంతో సెలబ్రేషన్స్ ని స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version