Varun Tej : వరుణ్ ఫోన్‌లో లావణ్య పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా? సీక్రెట్ చెప్పేసిన వరుణ్..

వరుణ్ గాండీవదారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమాతో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. దీంతో వరుణ్, చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 07:56 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇటీవల నిశ్చితార్థం చేసుకొని అందరికి షాక్ ఇచ్చారు. ఆరేళ్లుగా ప్రేమించుకున్నా ఒక్క గాసిప్ కూడా రాకుండా బాగా మెయింటైన్ చేశారు. సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని తమ ప్రేమని కూడా తెలిపారు. దీంతో అప్పట్నుంచి అంతా వీరి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు.

వరుణ్ గాండీవదారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమాతో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. దీంతో వరుణ్, చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా వరుణ్ ఓ టీవీ షోలో పాల్గొనగా అందులో ఉన్న ఆడియన్స్ వరుణ్ ని పలు ప్రశ్నలు అడిగారు. ఎక్కువగా లావణ్యకు సంబంధించి అడగగా వరుణ్ వాటికి సమాధానమిచ్చాడు.

ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ఫోన్ లో లావణ్య పేరు ఏమని సేవ్ చేసి ఉంటుంది అని అడగగా.. లవ్ (LAV) అని ఉంటుంది. అది కూడా తనే ఫోన్ తీసుకొని సేవ్ చేసింది అని చెప్పాడు. అలాగే తనకి మొదట ఏం గిఫ్ట్ ఇచ్చారు అని అడగ్గా.. చాలా ఏళ్ళు అయిపొయింది, గుర్తులేదు అని తెలిపాడు. ఇక వీరి వివాహం ఈ సంవత్సరంలోనే ఉండనుంది. అయితే ఇండియాలోనా లేదా ఇటలీలోనా అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

Also Read : Vijay Deverakonda: ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: రౌడీ బాయ్ షాకింగ్స్ కామెంట్స్