Varun Tej: ఆ హైట్ హీరో టాలీవుడ్ లో ఎవరూ లేరు.. ఇందంతా కుట్ర: వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్?

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 02:45 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా శుక్రవారం మార్చి 1 న గ్రాడ్ రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది.విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు దేశాన్ని రక్షించడానికి ప్రాణాలని సైతం ఎలా పణంగా పెడతారు లాంటి అంశాలని ఈ చిత్రంలో హైలైట్ చేయబోతున్నారు. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఎంతో అధ్యయనం చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే రిలీజ్ కి ముందు ఈ చిత్రం విషయంలో ఒక వివాదం నెలకొంది. ఇటీవల హైదరాబాద్ లో ఆపరేషన్ వాలంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని సంఘటనల ఆధారంగా వివరించారు. అదే క్రమంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసే భర్తలని కోల్పోయిన బార్యలకు 6 లక్షలు విరాళం కూడా ప్రకటించారు. అయితే నాగబాబు మాట్లాడిన ఒక మాట మాత్రం వైరల్ గా మారుతోంది. ఇంకా చెప్పాలంటే బాగా వివాదం అవుతోంది.

వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్ నుంచి రిస్క్ తో కూడుకున్న పాత్రలు చేస్తున్నాడని అందుకు గర్వంగా ఉందని చెప్పాడు. ఇండియన్ ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు వరుణ్ తేజ్ హైట్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని తెలిపారు. 5.3 అంగుళాలు ఎత్తు ఉండే వ్యక్తి కూడా పోలీస్ పాత్రలు వేస్తే చూడడానికి బావుండదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదం గా మారాయి. నాగబాబు 5.3 అంగుళాల ఎత్తు అంటూ టాలీవుడ్ లో ఒక అగ్ర హీరోపై సెటైర్లు వేసినట్లు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనితో వరుణ్ తేజ్ రంగంలోకి దిగాడు. కొందరు కావాలనే ఒక హీరోకి ఆ కామెంట్స్ ని ఆపాదిస్తున్నారు కాబట్టి నెగిటివిటి పెరిగే ప్రమాదం ఉంది. దీనిపై వరుణ్ తేజ్ వివరణ ఇస్తూ.. నాగబాబు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇండియన్ ఆర్మీ గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మాట్లాడారు.

ఇండియన్ ఆర్మీకి రూ 6 లక్షల విరాళం కూడా ప్రకటించారు. ఇవన్నీ సైడ్ అయిపోయాయి. కానీ కుట్ర పూరితంగా ఆ ఒక్క మాటనే వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అసలు టాలీవుడ్ లో 5.3 హైట్ ఉండే హీరో ఎవరూ లేరు. నేను 6.3 హైట్ ఉంటాను కాబట్టి నాన్న ఫ్లోలో 5.3 అడుగులు ఉన్న వాళ్ళు పోలీస్ పాత్రలకు అంతగా సూట్ కారని అన్నారు. ఇందులో వివాదం ఏముంది ? 5.3 అడుగుల ఎత్తు ఉండే హీరో టాలీవుడ్ లో ఎవరున్నారు. చూస్తుంటే కుట్ర పూరితంగా నెగిటివిటీ పెంచుతున్నట్లు ఉన్నారని వరుణ్ తేజ్ తెలిపారు. ఆ వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయం తప్ప ఎవరినీ ఉద్దేశించినవి కావు అని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.