Site icon HashtagU Telugu

Varun Tej : OG డైరెక్టర్ ని కాదన్న వరుణ్ తేజ్.. బ్యాడ్ లక్ ఇలా తగులుకుందే..!

Producers Exit from Varun Tej Movie

Producers Exit from Varun Tej Movie

వరుస ఫ్లాపులతో కెరీర్ రిస్క్ లో పడేసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గా వచ్చిన మట్కాతో కూడా ఘోర వైఫల్యాన్ని మూట కట్టుకున్నాడు. సినిమాల విషయంలో తన వరకు బెస్ట్ ఇస్తున్నా కూడా వరుణ్ తేజ్ కి కాలం ఏమాత్రం కలిసి రావట్లేదు. అయినా సరే అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఐతే గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ సినిమా ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.

మట్కా (Matka) సినిమా అయినా మరీ దారుణంగా ఉంది. ఐతే వరుణ్ తేజ్ (Varun Tej) ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా టైం లో ఓజీ డైరెక్టర్ సుజిత్ (Sujith) ఒక కథ చెప్పి సినిమా చేయాలని అనుకున్నారట. కానీ అతను ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చేయాలని అతన్ని కాదన్నాడట. అదే చేసి ఉంటే అతని కెరీర్ వేరేలా ఉండేది. Pawan Kalyan ఓజీ సినిమా మొదలు పెట్టాక పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల గ్యాప్ వచ్చింది.

పాపులర్ అయిన డైరెక్టర్ తో..

ఈ గ్యాప్ లో సుజిత్ అటు నానితో కానీ వరుణ్ తేజ్ తో కానీ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఇద్దరు అప్పుడు సిద్ధంగా లేరని లైట్ తీసుకున్నాడు. వరుణ్ తేజ్ సుజిత్ తో సినిమా చేసి ఉంటే మాత్రం బాగుండేదని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త పాపులర్ అయిన డైరెక్టర్ తో సినిమా చేస్తే బెటర్ అని చెబుతున్నారు. మట్కా ఇచ్చిన షాక్ తో కచ్చితంగా వరుణ్ తేజ్ కెరీర్ డైలమాలో పడిందని చెప్పొచ్చు.

సినిమా కోసం తాను ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. అనుకే వరుణ్ తేజ్ తన పంథా మార్చి మాస్ ఇంకా ఆడియన్స్ కి ఏదైతే ఇష్టమో అలాంటి సినిమాలే చేయాలని కొందరు ఫ్యాన్స్ సజెస్ట్ చేస్తున్నారు.

Also Read : Mokshagna : మోక్షజ్ఞ విలన్ గా స్టార్ హీరో కొడుకు.. అతన్ని ఎలా ఒప్పించారబ్బా..?