Varun Tej : ‘ఫిదా’ కాంబో మళ్ళీ సెట్ కాబోతుందా..?

'ఫిదా' కాంబో మళ్ళీ సెట్ కాబోతుందా..? ఈసారి ఏ జోనర్ తో ఆడియన్సు ని అలరించనున్నారు..?

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 03:32 PM IST

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘ఫిదా’. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2017లో రిలీజై సూపర్ హిట్టుగా నిలిచింది. వరుణ్ తేజ్, సాయి పల్లవిని స్టార్స్ ని చేసిన ఈ సినిమా.. శేఖర్ కమ్ముల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిపోయింది. ఆ సినిమాతో అందర్నీ ఫిదా చేసిన ఆ కాంబో మళ్ళీ ఇప్పుడు చేతులు కలపబోతున్నారట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేయబోతున్నారట.

ప్రస్తుతం తమిళ్ హీరో ధనుష్ ‘కుబేర’ సినిమా చేస్తున్న శేఖర్ కమ్ముల.. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని వరుణ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈక్రమంలోనే వరుణ్ తేజ్ ని కలిసి ఒక కథ కూడా వినిపించారట. ఇక ఆ కథ విన్న వరుణ్ తేజ్.. శేఖర్ కమ్ములకు వెంటనే ఓకే చెప్పేశారట. కుబేర సినిమా పూర్తీ అయిన తరువాత శేఖర్ కమ్ముల.. ఆ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారట. కాగా వరుణ్ కూడా ప్రస్తుతం ‘మట్కా’ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇక రీ యూనియన్ కాంబోలోకి సాయి పల్లవిని కూడా తీసుకుంటారా..? లేదా వరుణ్ అండ్ శేఖర్ కమ్ముల మాత్రమే ముందుకు వెళ్తారా..? అనేది చూడాలి. అలాగే శేఖర్ కమ్ముల ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నారో అని ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకుంది. ఎందుకంటే ఫిదా తరువాత శేఖర్ కమ్ముల.. లవ్ స్టోరీస్ ని పక్కన పెట్టి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఫిదా తరువాత ఈ దర్శకుడు నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమా చేసారు.

టైటిల్ లో లవ్ స్టోరీ అని పెట్టినా.. కథ మాత్రం కులం అనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఇక ఇప్పుడు తెరకెక్కిస్తున్న కుబేర మూవీ.. డబ్బు అనే పాయింట్ చుట్టూ తిరగనుందని సమాచారం. ఈక్రమంలో వరుణ్ తో చేయబోయే మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.