Varun Tej Operation Valentine Trailer మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. 2019 పుల్వామా ఎటాక్ తర్వాత బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించాడు.
సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించింది. రుహాని శర్మ, నవదీప్ కూడా సినిమాలో నటించారు. ట్రైలర్ చూస్తే ఎంచుకున్న కథకు తగినట్టుగానే విజువల్స్, స్క్రీన్ ప్లే ఉన్నట్టు అనిపిస్తుంది. నేషనల్ లెవెల్ లో ప్రేక్షకులందరినీ దేశభక్తితో ముంచెత్తేలా ఈ సినిమా రాబోతుందని చెప్పొచ్చు.
ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా ఎమోషనల్, పేట్రియాటిక్ ఫీల్ కలిగేలా చేస్తుందని చెప్పొచ్చు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమా విజువల్ గ్రాండియర్ గా అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ అంచనాలు పెంచింది. వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ సినిమా తప్పకుండా డిఫరెంట్ మూవీగా నిలుస్తుదని అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ని తెలుగులో రాం చరణ్ రిలీజ్ చేయగా హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు.