Site icon HashtagU Telugu

Operation Valentine Profits : రిలీజ్ ముందే లాభాల్లో వరుణ్ తేజ్ సినిమా.. ఇది కదా మెగా ప్లాన్ అంటే..!

Varun Tej Operation Valentine Profits Before Theatrical Release

Varun Tej Operation Valentine Profits Before Theatrical Release

Operation Valentine Profits మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ తాలెంటైన్ రిలీజ్ కు ఉందే లాభాలు తెచ్చి పెట్టింది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ఈ సినిమాను మూడు నెలల్లో 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారట. అయితే థియేట్రికల్ బిజినెస్ తో సంబంధం లేకుండానే టేబుల్ ప్రాఫిట్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను డిజిటల్ రైట్స్ ని అమేహాన్ ప్రైం భారీ రేటుకి కొనేసిందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రైం వారు ఈ సినిమాను 26 కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది. హిందె నాన్ థియేట్రికల్ రైట్స్ మరో 14 కోట్ల దాకా వచ్చాయట. ఆడియో రైట్స్ రూపం లో 2.6 కోట్లు రాగా తెలుగు శాటిలైట్ రైట్స్ మరో 6.5 కోట్లు వచ్చాయట. సో మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే సినిమా ప్రాఫిట్స్ లోకి వచ్చేసింది.

ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమా ఎంత కలెక్ట్ చేసినా అదంతా లాభమే అని చెప్పొచ్చు. నాన్ థియేట్రికల్ రైట్స్ లో వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. ఆపరేషన్ వాలెంటైన్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో హిందీలో కూడా తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు వరుణ్ తేజ్.