Site icon HashtagU Telugu

Operation Valentine : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోయే సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ రిలీజ్..

Varun Tej Operation Valentine Movie Teaser Released

Varun Tej Operation Valentine Movie Teaser Released

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వరుణ్ గత సినిమాలు గని, గాండీవధారి అర్జున సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇటీవల తను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavanya Tripathi) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెళ్లి తర్వాత మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు.

వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్(Manushi Chhillar) జంటగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ జెట్ ఫైటర్స్ గా నటిస్తున్నారు. పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం సమయంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. గాలిలో జెట్ ఫైటర్స్ విన్యాసాలు అదరగొట్టేశాయి. ఓ వైపు ప్రేమ ఎమోషన్స్ తో పాటు మరోవైపు దేశం ఎమోషన్స్ కూడా చూపించారు. ఇక టీజర్ లో.. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా. ఈ విషయాన్నీ శత్రువులకు తెలియచేద్దాం అనే డైలాగ్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కచ్చితంగా వరుణ్ కి హిట్ ఇస్తుందని భావిస్తున్నారు. ఇక ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.

Also Read : Salaar : సలార్ సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలో తెలుసా?