Varun Tej Matka మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మట్కా సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తుంది. మట్కా సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ చూసిన వారంతా కూడా ఇది వరుణ్ తేజ్ K.G.F అనేయడం మొదలు పెట్టారు.
మట్కా కథ అంతా 1950 నుంచి 1980 కాల మధ్యలో జరుగుతుంది. అందుకే ఈ సినిమా కోసం పూర్ణా మార్కెట్ సెట్ ని వేశారు. దాదాపు 10 ఎకరాల్లో వేసిన ఈ సెట్ లో 1500 షాపుల దాకా వేసినట్టు తెలుస్తుంది. మట్కా సినిమాలో వేసిన పూర్ణా మార్కెట్ సెట్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ సెట్ గురించి ప్రొడక్షన్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్ మాట్లాడారు.
పూర్ణా మార్కెట్ ఒక క్యారెక్టర్..
డైరెక్టర్ కరుణ కుమార్ కూడా మట్కా (Matka) కథలో పూర్ణా మార్కెట్ అనేది ఒక క్యారెక్టర్ అని అన్నారు. సో కథలో భాగమైన ఈ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మట్కా సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంది. మరి ఈ సినిమా మెగా హీరోకి సక్సెస్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej,) సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోవట్లేదు. మరి మట్కాతో అది సాధ్యపడుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాను నవంబర్ 14న రిలీజ్ లాక్ చేశారు.