Varun Tej Matka : మెగా ప్రిన్స్ సినిమాకు బడ్జెట్ సమస్యలా.. పాన్ ఇండియా సినిమాకు ఈ కష్టాలేంటి..?

Varun Tej Matka మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా సినిమా

Published By: HashtagU Telugu Desk
Varun Tej Matka Movie Hold For Budget Problem

Varun Tej Matka Movie Hold For Budget Problem

Varun Tej Matka మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా సినిమా చేస్తున్నాడు. వైరా ప్రొడక్షన్స్ లో తెరకెక్కే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు.

వరుణ్ తేజ్ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు వచ్చినట్టు తెలుస్తుంది. సినిమాను ముందు భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లాన్ చేసినా సరే వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్న డౌట్ తో కాస్త హోల్డ్ లో పెట్టారట.

కరుణ కుమార్ ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా ప్లాన్ చేశారు. సినిమా కథ మొత్తం 1980స్ టైం లో నడుస్తుందని తెలుస్తుంది. అయితే సినిమా కథలో బలం ఉన్నా తగినట్టుగా తీయాలంటే బడ్జెట్ కావాలి అయితే ముందు అనుకున్న బడ్జెట్ తో పూర్తి చేయడం కుదరదని మేకర్స్ వెనుకడుగు వేస్తున్నారట.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తర్వాత కరుణ కుమార్ చేస్తున్న ఈ సినిమాపై టైటిల్ పోస్టర్ తో అంచనాలు పెంచారు. సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా హిట్ పడితే ఆ బేస్ మీద అయినా వరుణ్ తేజ్ మట్కా సెట్స్ మీదకు వెళ్తుందేమో చూడాలి. చాలామంది స్టార్స్ కి పెళ్లైన తర్వాత కెరీర్ లో దూకుడు మొదలవుతుంది. లావణ్య త్రిపాఠి మ్యారేజ్ తర్వాత వరుణ్ తేజ్ కెరీర్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

  Last Updated: 13 Feb 2024, 09:50 PM IST