Varun Tej-Lavanya: మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వారి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు. స్టైలిస్ దుస్తుల్లో అందాల జంట మెరిసిపోయింది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. పుష్ప2 షూటింగ్ బిజీ వల్ల అల్లు అర్జున్ హాజరు కాలేదు. వచ్చే నెల వరుణ్, లావణ్యల పెళ్లి జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేశారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వరుణ్‌తేజ్, లావణ్య కలిసి ‘మిస్టర్’ చిత్రంలో నటించారు. తదుపరి వీరిద్దరి కలయికలో ‘అంతరిక్షం’ చిత్రం తెరకెక్కింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో లావణ్య, వరుణ్‌తేజ్ త్వరలో మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే స్పెయినలో వరుణ్ బ్యాచలర్ పార్టీ ఇచ్చారు. ఇప్పుడు చిరు ఇంట ప్రీ వెడ్డింగ్ పనులు షురూ అయ్యాయి.
ఇటలీలోని ఓ ప్రముఖ ఫ్యాలెస్‌లో వరుణ్, లావణ్యల వివాహం జరగనుందని సమాచారం. ఓ చిన్న సెంటిమెంట్ కారణంగా ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వరుణ్, లావణ్యల ప్రేమకు పునాది పడింది ఇటలీలోనేట. ఈ ఇద్దరు జంటగా నటించిన ‘మిస్టర్’ సినిమా షూటింగ్ అక్కడే జరిగింది. ఇక షూటింగ్ కోసం కోసం ఇటలీ వెళ్లిన వరుణ్, లావణ్యలు..అక్కడే స్నేహితులయ్యారట. ఆ బంధం కాస్త కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. దీంతో ప్రేమ పుట్టిన చోటో పెళ్లి చేసుకుందామంటూ ఈ ఇద్దరు నిర్ణయించుకున్నారని తెలిసింది.
About Last evening ..
Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023
Also Read: Smart Phones: స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్న పిల్లలు, ఈ జాగ్రత్తలతో దూరం చేయొచ్చు