Site icon HashtagU Telugu

Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి జరిగేది ఏ దేశంలోనో తెలుసా? క్లారిటీ ఇచ్చిన ఉపాసన..

Varun Tej Lavanya Tripathi Destination Wedding Planned at Italy

Varun Tej Lavanya Tripathi Destination Wedding Planned at Italy

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గత ఆరేళ్లుగా ఎవరికీ తెలియకుండా ప్రేమించుకొని ఇటీవల సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. వరుణ్ లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలియడంతో షాక్ అయి ఆనందం వ్యక్తపరుస్తున్నారు అభిమానులు. పెళ్లి వేడుకలు(Marriage) ఘనంగా మొదలయ్యాయి.

ఇప్పటికే ఈ ఇద్దరూ బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దగ్గర పెళ్ళికి స్పెషల్ గా బట్టలు డిజైన్ చేయించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరగగా మెగా ఫ్యామిలీ ఆ ఫోటోలని కూడా షేర్ చేసింది. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు వీరు పెళ్లి చేసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. అలాగే వరుణ్ లావణ్య పెళ్లి ఎక్కడ జరుగుతుందా అని అంతా చర్చించుకుంటున్నారు.

విదేశాల్లోనే వీరి పెళ్లి జరగనుందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఉపాసన దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. టుస్కానీ.. మా ఫ్యామిలీ అంతా రాబోతుంది అని పోస్ట్ చేసింది ఉపాసన. టుస్కానీ అనేది ఇటలీలో(Italy) సముద్రం దగ్గర ఉండే ఒక ఏరియా. ఓ పక్క సముద్రం, ఓ పక్క పచ్చదనంతో టుస్కానీ చాలా బాగుంటుంది. అక్కడే వరుణ్ లావణ్య డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. అక్టోబర్ చివర్లోనే వీరి వివాహం ఉండబోతుందని సమాచారం.

 

Also Read : Unstoppable with NBK 3 : బాలయ్య అన్‌స్టాపబుల్ మళ్ళీ రాబోతుంది.. సీజన్ 3 షురూ..