రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరలవుతోంది. ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ రెడీ చేశారని, వరుణ్ కు తన క్యారెక్టర్ గురించి వివరించినట్లు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో సందీప్ వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్లో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి. ఈ సినిమా ఫై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అర్జున్ రెడ్డి తో తన టాలెంట్ ఏంటో చూపించిన సందీప్..ఈ మధ్య యానిమల్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయి లో తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తుండడంతో సినిమా అప్డేట్స్ గురించి వెయ్యి కళ్లతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ మూవీ లో ప్రభాస్ కు విలన్ గా వరుణ్ తేజ్ నటించబోతున్నాడని తెలిసి మెగా , ప్రభాస్ అభిమానులు సినిమా పై అంచనాలు పెంచేసుకుంటున్నారు.
Republic Day 2025 : గణతంత్ర పరేడ్లో ఏపీ శకటం
ప్రస్తుతం వరుణ్ కూడా హీరోగా వరుస ప్లాప్స్ చవిస్తున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదించలేకపోతుంది. దీంతో ఇలా విలన్ గా నైనా తన నటనను కనపరచాలని చూస్తున్నాడు, గతంలో గద్దలకొండ గణేష్ లో విలన్ క్యారెక్టర్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఇక స్పిరిట్ లో ‘ప్రభాస్ పోలీసు పాత్రలో నటిస్తారని, కానీ కథలో మలుపుల కారణంగా ఆయన గ్యాంగ్ స్టార్ గా మారుతారు. భారీ వైల్డ్ ఎలిమెంట్స్ మూవీకి హైలైట్గా నిలుస్తాయి’ అని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు.