Varun Tej: స్టూడెంట్స్ మధ్యలో భార్య గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన వరుణ్ తేజ్?

మెగా హీరో ప్రిన్సెస్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిస

Published By: HashtagU Telugu Desk
Mixcollage 07 Feb 2024 07 51 Am 7353

Mixcollage 07 Feb 2024 07 51 Am 7353

మెగా హీరో ప్రిన్సెస్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇకపోతే వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు వచ్చే నెల అనగా మార్చి 1వ తేదీన విడుదల కాబోతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా ఆపరేషన్ వేలంటైన్. ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ మూవీని సందీప్ ముద్ద నిర్మించారు.

ఇందులో వరుణ్ తేజ్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్‌ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా సాంగ్ రిలీజ్ వేడుక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. ఈ వేడుకలో సినిమా టీమ్ సందడి చేసారు. కాలేజ్ స్టూడెంట్స్ వరుణ్‌ ని అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. బాబాయ్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అని స్టూడెంట్స్ ప్రశ్నించగా వరుణ్ తేజ్ స్పందిస్తూ.. నేను కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అనంతరం మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అని అడగగా.. వరుణ్ స్పందిస్తూ.. నా ఫేవరెట్ హీరోయిన్‌ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను తను ఇంట్లో ఉంది అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు వరుణ్ తేజ్.

లావణ్య త్రిపాఠి కాకుండా ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా.. సాయి పల్లవి అంటూ సమాధానం ఇచ్చారు వరుణ్. ఇక లావణ్యకు తనే ముందుగా ప్రపోజ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఇకపోతే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గత ఏడాది మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే ఆరేళ్లపాటు ప్రేమించుకున్న లావణ్య వరుణ్ తేజ్ లు ఇరువురి పెద్దల సమక్షంలో ఒకటయ్యారు.

  Last Updated: 07 Feb 2024, 07:51 AM IST