Site icon HashtagU Telugu

Varun Tej Comments : వరుణ్ తేజ్ కామెంట్స్ బన్నీ పైనేనా..?

Varun Tej Bunny

Varun Tej Bunny

ప్రస్తుతం సోషల్ మీడియా లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తాజాగా చేసిన కామెంట్స్ (Varun TeJ Latest Comments) వైరల్ గా మారాయి. ‘మనం పెద్దోళ్లం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. సక్సెస్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎలా వచ్చాం.. అన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా వృథానే’ అని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చ లేపుతున్నాయి.

వరుణ్ తేజ్.. కెరీర్ మొదట్లోనే ప్రయోగాత్మక చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత ఎందుకో సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ప్రస్తుతం మట్కా (Matka ) అంటూ ఓ డిఫరెంట్ మూవీతో ఈ వారం ( నవంబర్ 14న ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి , నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు నటిస్తున్నారు.

నిన్న ఆదివారం నాడు వైజాగ్‌లో గ్రాండ్‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ (Matka Pre Release) ఈవెంట్ జరిపారు. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ స్టేజ్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత సినిమాల గురించి మాట్లాడుతూ… సినిమాలు పోయినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని, ఆ టైంలోనే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని, తన అన్న రామ్ చరణ్ తనకు అండగా నిలుస్తాడని, మోరల్ సపోర్ట్ ఇస్తాడని వరుణ్ చెప్పుకొచ్చారు. వంద మాటలు మాట్లాడాల్సిన పని లేదు.. కేవలం తన అన్న తన భుజం మీద చేయి వేస్తే చాలని తెలిపాడు.

పెదనాన్న, బాబాయ్, అన్న గురించి ఎందుకు పదే పదే చెబుతావ్ అని తనను అందరూ అడుగుతుంటారు… మనం పెద్దోళ్లం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. సక్సెస్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎలా వచ్చాం.. అన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా వృథానే అని వరుణ్ అన్నాడు. ఈ మాటలు జెన్యూన్ గా అనిపించినా కానీ, వరుణ్ చెప్పేది నిజమే అయినా కానీ, ఎందుకో ఈ మాటలు మాత్రం అల్లు అర్జున్‌ మీద కౌంటర్లే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ ఈ మధ్య స్టేజ్ ఎక్కితే తనని తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు.. ఏ సహకారం లేకుండా ఒంటరిగానే ఈ రేంజ్ కి వచ్చినట్టుగా గ్యాస్ కొట్టుకుంటూ.. ఒకప్పటిలా ఎక్కడా కూడా మెగా పేరు గురించి మాట్లాడటం లేదు. అంతే ఎందుకు అసలు మెగా హీరో అనే ట్యాగ్‌ని బన్నీ దూరం పెడుతూ వస్తున్నాడు. అందుకే వరుణ్ బన్నీ పై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసాడని అంత మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా వరుణ్ ..బన్నీ గురించే అన్నాడా..? లేక మాములుగా అన్నాడా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : Saturn Effect : నవంబర్ 15 తర్వాత ఈ మూడు రాశులవారికి పట్టిందల్లా బంగారమే..!!