Site icon HashtagU Telugu

Mega Prince: వరుణ్ తేజ్ బర్త్ డే.. చిరు, రాంచరణ్, తేజ్ గ్రీటింగ్స్!

Varun Tej

Varun Tej

ఇవాళ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ (Varun tej) బర్త్‌డే. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు, మెగా హీరోలు (Mega heros) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు మెగా హీరోలు సాయిధరమ్‌ తేజ్‌, రామ్‌చరణ్‌ (Ram charan), చిరంజీవి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, విజయం నీ వెంటే ఉంటుంది’ అని వారి చిన్ననాటి ఫొటోను రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. సాయిధరమ్ తేజ్, చిరంజీవి (Chiranjeevi) కూడా పాత అరుదైన ఫొటోలను షేర్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే వారికి తొలి సినిమా వరకూ ఘనమైన గుర్తింపే దక్కుతుంది. నాగబాబు తనయుడిగా మెగాస్టార్ చిరంజీవి, మెగాభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్న వరుణ్ తన టాలెంట్ తో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు.

కంచె సినిమా వరుణ్ (Varun tej) ఆలోచనా సరళికి నిదర్శనమని చెప్పాలి. దశాబ్దాల క్రితం నాటి యుద్ధ నేపథ్యం, ప్రేమ భావోద్వేగాల కథలో తన ప్రతిభను కనబరచి భవిష్యత్తు సినీ ప్రయాణాన్ని మార్గం ఏర్పరచుకున్నాడు. సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. మెగా హీరో అంటే మాస్, యాక్షన్ అని కాకుండా తొలి అడుగులతోనే నటనపై తనకున్న పట్టు చూపించాడు. కథా బలమున్న పాత్రల్లో వరుణ్ తేజ్ (Varun tej) మెప్పించి మెగా వారసత్వాన్ని ఘనంగా చాటాడు. తొలిప్రేమ, ఫిదా సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. అంతరిక్షం వంటి ప్రయోగాత్మక సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఏదైనా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు వరుణ్.

Also Read: Chiranjeevi Demands: భోళా శంకర్‌ కు ‘చిరంజీవి’ కండీషన్స్