Varun Tej – Sai Pallavi Movie: సాయి పల్లవి వరుణ్ తేజ్ కాంబినేషన్లో మరో సినిమా ఫిక్స్.. ఫిదాకు మించి ఉండబోతోందంటూ?

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఫిదా. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ఇకపోతే ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, వరుణ్ తేజ్ లో మరొకసారి కలిసిన నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయం గురించి అనేక సార్లు సోషల్ మీడియాలో చర్చలు కూడా […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 27 Feb 2024 08 42 Am 5776

Mixcollage 27 Feb 2024 08 42 Am 5776

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఫిదా. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. ఇకపోతే ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, వరుణ్ తేజ్ లో మరొకసారి కలిసిన నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయం గురించి అనేక సార్లు సోషల్ మీడియాలో చర్చలు కూడా జరిగాయి. అయితే ఎట్టకేలకు అభిమానులు కోరుకున్న విధంగానే సాయి పల్లవి, వరుణ్ తేజ్ కాంబోలో ఒక సినిమా రాబోతోంది.

ఇదే విషయాన్ని తాజాగా వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటించారు. కాగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. భారత వైమానిక దళం నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆ పరేషన్ ఆధారంగా రూపుదిద్దుకుందీ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలో ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సాయిపల్లవితో మరోసారి చేయబోయే సినిమా గురించి స్పందించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. సాయిపల్లవితో మరోసినిమా చేయాలని ఉంది.

కచ్చితంగా చేస్తాం. సాయిపల్లవి కూడా తన ఆఫీస్ కు వచ్చే కథలను చెబుతూ ఉంటోంది. కానీ మేం చేయబోయే కథ ఫిదా కంటే కాస్తా ఎక్కువగా ఉండాలని చూస్తున్నాము. అందుకే కాస్త ఆలస్యం అవుతోంది. మంచి లవ్ స్టోరీ వస్తే మాత్రం కాంబినేషన్ రిపీట్ అవ్వుద్ది. నాకూ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ సినిమాలు చేయాలనుంది. నెక్ట్స్ వాటిపైనే ఫోకస్ పెడుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక ఆపరేషన్ వాలెంటైన్స్ మార్చి 1న విడుదల కాబోతోంది.

  Last Updated: 27 Feb 2024, 08:42 AM IST