Site icon HashtagU Telugu

Matka Movie Team : మట్కా హిట్ కావాలంటూ దేవాలయాలను చుట్టేస్తున్న వరుణ్ తేజ్..

Matka Team Tpt

Matka Team Tpt

మట్కా (Matka) హిట్ కోసం వరుణ్ తేజ్ (Varun Tej) గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కెరీర్ మొదట్లోనే ప్రయోగాత్మక చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్న వరుణ్.. ఆ తర్వాత ఎందుకో సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ప్రస్తుతం మట్కా (Matka ) అంటూ ఓ డిఫరెంట్ మూవీతో ఈ వారం ( నవంబర్ 14న ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి , నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేసాయి. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడం తో మట్కా టీం దేవాలయాలను చుట్టేస్తున్నారు.

తాజాగా హీరో వరుణ్ తేజ్, మట్కా టీమ్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మట్కా సినిమా హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ద‌ర్శ‌నానంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించ‌గా, ఆల‌య అధికారులు వారికి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేసి ప‌ట్టు వ‌స్త్రంతో సత్క‌రించారు. నిన్న విజయవాడ దుర్గమ్మ ను కూడా టీం దర్శించుకున్నారు. ఇటు మెగా స్టార్ చిరంజీవి సైతం మట్కా టీం కు బెస్ట్ విషెష్ ను తెలిపారు.

“విభిన్నమైన కథలు, విలక్షణమైన స్క్రిప్టుల పట్ల నీ తపన చూస్తుంటే గర్వంగా ఉంది. నీ ప్రతిభ ఎప్పటికప్పుడు అద్భుతం అనిపిస్తుంటుంది. ఇప్పుడు మట్కా ట్రైలర్ చూస్తుంటే అదిరిపోయింది! మట్కా నవంబరు 14న థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో, యావత్ చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. మరి రేపు థియేటర్స్ లలో మట్కా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Read Also : Vijay Deverakonda – Balakrishna : విజయ్ దేవరకొండ సినిమాకు బాలయ్య సాయం.. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే..

Exit mobile version