Site icon HashtagU Telugu

Varun Tej : మెగా ప్రిన్స్ సాలిడ్ గా కొడితే తప్ప..!

Producers Exit from Varun Tej Movie

Producers Exit from Varun Tej Movie

Varun Tej మెగా హీరోల్లో సక్సెస్ రేటు పూర్తిగా పడిపోయిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు. చేయడానికి రకరకలా కొత్త ప్రయత్నాలు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా సరే ఎందుకో వరుణ్ తేజ్ కి లక్ కలిసి రావట్లేదు. ముఖ్యంగా సినిమాల ఎంపికల్లో అతనికి లక్ ఫేవర్ చేయట్లేదు. సినిమా కథ బాగుంది అనుకోగా రిజల్ట్ చూస్తే మాత్రం తేడా కొట్టేస్తుంది.

ప్రస్తుతం కరుణ కుమార్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ మట్కా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. మట్కా సినిమా బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందని ఈమధ్య వార్తలు రాగా సినిమా కమర్షియల్ గా థియేటర్స్ లో సక్సెస్ అవ్వట్లేదు కానీ వరుణ్ తేజ్ సినిమాలకు డిజిటల్, శాటిలైట్ మార్కెట్ బాగానే ఉంది.

అందుకే ఈసారి మట్కా విషయంలో మరింత ఫోకస్ తో పనిచేస్తున్నాడు వరుణ్ తేజ్. తను ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ కథతో ఎగ్జైట్ చేయాలని అనుకుంటుండగా ఫ్యాన్స్ మాత్రం ముందు వరుణ్ తేజ్ నుంచి ఒక మెగా హిట్ కావాలని అంటున్నారు. మట్కా సినిమాతో పాటుగా మరో సినిమా కూడా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. ఆ సినిమాలో వరుణ్ తేజ్ ఏఐ తో ప్రేమలో పడతాడని టాక్. మొత్తానికి మెగా హీరో ట్రాక్ ఎక్కడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పొచ్చు.