Site icon HashtagU Telugu

Varun Sandesh : షూటింగ్‌లో వరుణ్ సందేశ్‌కి గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు..

Varun Sandesh injured in Movie shooting joined in Hospital

Varun Sandesh injured in Movie shooting joined in Hospital

కెరీర్ ఆరంభంలో కొత్తబంగారు లోకం, హ్యాపీడేస్, కుర్రాడు, ఏమైంది ఈ వేళ.. లాంటి పలు సూపర్ హిట్స్ కొట్టిన వరుణ్ సందేశ్(Varun Sandesh) ఆ తర్వాత వరుస ఫ్లాప్ సినిమాలు చూశాడు. దీంతో కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యాడు వరుణ్. ఇటీవల బిగ్‌బాస్(BiggBoss) లో తన భార్యతో కలిసి పాల్గొని బయటకు వచ్చాక మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేశాడు.

ప్రస్తుతం పలు సినిమాలు, షోలతో బిజీగా ఉన్నాడు వరుణ్ సందేశ్. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో వరుణ్ సందేశ్ కి తీవ్రగాయాలయ్యాయి. వరుణ్ సందేశ్ హీరోగా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం అవుతున్న చిత్రం ‘కానిస్టేబుల్’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని, ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయిందని సమాచారం.

తాజాగా చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో వెంటనే చిత్రయూనిట్ వరుణ్ ని హాస్పిటల్ కి తరలించారు. చికిత్స అనంతరం డాక్టర్లు వరుణ్ ని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్టు సమాచారం. వరుణ్ కి ఇలా జరగడంతో కానిస్టేబుల్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. వరుణ్ పూర్తిగా కోలుకున్నాకే మళ్ళీ షూటింగ్ మొదలవుతుందని చిత్రయూనిట్ తెలిపారు.

 

Also Read : Betha Sudhakar : చిరంజీవి బలవంతంతో సుధాకర్‌ ఆ సినిమా ఒప్పుకున్నారు.. ఆ తరువాత సుధాకర్ కెరీర్..