Varun-Lavanya: ఇటలీలో వరుణ్-లావణ్యల పెళ్లిసందడి, మెగా ఫ్యామిలీ పిక్స్ వైరల్

మెగా జంట లావణ్, వరుణ్ తేజ పెళ్లి వేడుక షురూ అయ్యింది. విందులు, వినోదాలతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ జోరుగా ఎంజాయ్ చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Varun Lavnya

Varun Lavnya

Varun-Lavanya: నటుడు నాగబాబు, పద్మజ కొణిదెల కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నవంబర్ 1, 2023 న దేవరాజ్, కిరణ్ త్రిపాఠిల కుమార్తె లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందుకోసం ఇటలీలోని సియానాలోని సుందరమైన బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌ ముస్తాబైంది. మెగా కుటుంబ సభ్యుల సందడితో పెళ్లి వేడుక కోలాహలంగా మారింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి తారలు సందడి చేస్తున్నారు.

ఇప్పటికే అద్భుతమైన కాక్‌టెయిల్ పార్టీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు హల్దీ వేడుక ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. వరుణ్, లావణ్య వివాహం కూడా నవంబర్ 1, 2023న జరుగుతుంది. శుభ ముహూర్తం మధ్యాహ్నం 2:48 గంటలకు జరుగుతుంది. అదే రోజు రాత్రి 8:30 గంటలకు ప్రారంభమయ్యే వివాహ రిసెప్షన్‌తో సెలబ్రేషన్స్ ఉంటాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉల్లాసంగా పాల్గొంటారు. మొత్తంగా 120 మంది అతిథులతో పెళ్లి వేడుక కళకళలాడుతోంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ వెస్ట్రన్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Also Read: Transgender: అసెంబ్లీ ఎన్నికల బరిలో ట్రాన్స్ జెండర్, ఆ పార్టీ నుంచి పోటీ!

  Last Updated: 31 Oct 2023, 12:58 PM IST