Site icon HashtagU Telugu

Varun Dhawan: తండ్రి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. స్పెషల్ విషెష్ హీరోయిన్ సమంత?

Mixcollage 19 Feb 2024 08 00 Am 9829

Mixcollage 19 Feb 2024 08 00 Am 9829

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయనకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ వరుణ్ కి తెలుగులో బాగానే ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇకపోతే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తన గంప ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు వరుణ్ ధావన్. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ అభిమానులకు శుభవార్తను తెలిపారు.

తాను త్వరలో తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా సతీమణి నటాషా దలాల్ బేబీ బంప్‌ను ముద్దాడుతున్న క్యూట్‌ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు వరుణ్ ధావన్. దీంతో వరుణ్ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వరుణ్, నటాషాలది ప్రేమ వివాహం. వీరు 2021లో పెళ్లిపీటలెక్కారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లిలో మూడేళ్లకు అమ్మ నాన్నలుగా ప్రమోషన్ పొందబోతున్నారు, వరుణ్ నటాషా.

మేము అమ్మానాన్నలు కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి అంటూ శుభవార్తను పంచుకున్నాడు వరుణ్. ఆ పోస్టుపై స్పందించిన పలువురు బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్ లాంటి సెలబ్రిటీలు వరుణ్, నటాషా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ కు ప్రత్యేకంగా సమంత శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది.

Exit mobile version