బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్ (Bellamkonda Srinivas) మళ్లీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాగర్ చంద్ర డైరెక్షన్ లో ఒక సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాతో పాటుగా మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు శ్రీనివాస్. మున్నా డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమాకు టైటిల్ గా దేవుడే దిగి వచ్చినా అని ఫిక్స్ చేశారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాకు ముందు ఈ టైటిల్ ని అనుకున్నారు. దేవుడే దిగి వచ్చినా వెరైటీ టైటిల్ తో ఈసారి బెల్లంకొండ శ్రీనివాస్ క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు. యాంకర్ ప్రదీప్ తో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన మున్నా తన సెకండ్ సినిమాకు కొంత టైం తీసుకున్నాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ తో దేవుడే దిగి వచ్చినా సినిమాతో వస్తున్నాడు మున్నా. ఈ సినిమా టైటిల్ కి తగినట్టుగా కథ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ ఇయర్ సాగర్ చంద్ర డైరెక్షన్ సినిమాతో పాటుగా దేవుడే దిగి వచ్చినా అంటూ రెండు సినిమాలతో ఆడియన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ హీరో.
Also Read : Hanuman : హనుమాన్ ని తక్కువ అంచనా వేయలేం..!