Varanasi Release Date: లెజెండరీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి భారీ లక్ష్యంతో సిద్ధమవుతున్నారు. ఈసారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఆయన ఒక భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘వారణాసి’ (Varanasi) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ప్రకటించినప్పటి నుండి నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. కేవలం ప్రకటన, టీజర్ తోనే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9, 2027న శ్రీరామనవమి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు అంటూ సీఎం రేవంత్ సూచన
తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది మార్చి 26, 2026న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేక అప్‌డేట్‌ను టీమ్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఆ రోజున ఒక పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ (Glimpse) విడుదల కావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె. నారాయణ, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్న ఈ రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి.
