Site icon HashtagU Telugu

Globetrotter Event: వార‌ణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ఎంత ఖ‌ర్చు పెట్టించారో తెలుసా?

Globetrotter Event

Globetrotter Event

Globetrotter Event: భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచేందుకు సిద్ధమవుతున్న ఎస్.ఎస్. రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కలయిక చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ (Globetrotter Event) ఖరారైంది. ఈ సినిమా హాలీవుడ్‌కు దీటుగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రూ. 50 కోట్ల డీల్‌తో లాభాల బాట

సినిమాకు సంబంధించిన ఒక ప్రారంభ కార్యక్రమాన్ని రాజమౌళి ఇటీవల హైదరాబాద్‌లో భారీ బడ్జెట్‌తో నిర్వహించారు. ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ హక్కులను జియో-హాట్‌స్టార్‌కు ఏకంగా రూ. 50 కోట్లకు విక్రయించడం విశేషం. ఈ డీల్‌తో సినిమా విడుదల కంటే ముందే భారీ లాభాలను ఆర్జించింది. ఈవెంట్ నిర్వహణ కోసం సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఈ కార్యక్రమంలో నటి శృతి హాసన్ ప్రదర్శనకు రూ. 1 కోటి చెల్లించగా, యాంకర్ సుమ కనకాల, ఆశిష్‌లకు కూడా భారీ పారితోషికం లభించింది. సినిమాల నిర్మాణంతో పాటు, వాటిని గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చడంలో రాజమౌళి దార్శనికత మరోసారి అద్భుతంగా నిరూపితమైంది.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆటగాళ్లు వేలంలోకి ఎందుకు రాలేకపోతున్నారు?

గ్లోబల్ టార్గెట్‌గా ‘వారణాసి’

‘వారణాసి’ చిత్రం 120 దేశాలలో ఒకేసారి విడుదల కానుండటం దీని అంతర్జాతీయ స్థాయికి నిదర్శనం. దీనిని ఇప్పటికే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లతో పోలుస్తున్నారు. ‘RRR’ విజయంతో స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకుల ప్రశంసలు అందుకున్న రాజమౌళి.. మహేష్‌తో ఏం సృష్టించబోతున్నారనే ఉత్సాహం అందరిలోనూ ఉంది.

హాలీవుడ్ తరహా ప్రమోషనల్ ప్లాన్

రాజమౌళి ఈ ప్రమోషన్‌ను పాన్-ఇండియా స్థాయికి మించి అంతర్జాతీయంగా పరిచయం చేయడానికి హాలీవుడ్ తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌కు మీడియాను ఆహ్వానించలేదు. బదులుగా ప్రత్యేక స్ట్రీమింగ్ డీల్ ద్వారా ప్రపంచవ్యాప్త సినీ జర్నలిస్టులకు ప్రైవేట్ ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేకమైన ప్రమోషనల్ ప్లాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఈవెంట్ ద్వారా మహేష్ లుక్, కాన్సెప్ట్ గ్లింప్స్‌ను వెల్లడించిన విష‌యం తెలిసిందే.

Exit mobile version