Site icon HashtagU Telugu

Varalaxmi Sarathkumar Wedding Reception : అట్టహాసంగా వరలక్ష్మి శరత్‌కుమార్ వెడ్డింగ్‌ రిసెప్షన్‌

Varalakshmi Wedding Res

Varalakshmi Wedding Res

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ (Varalaxmi Sarathkumar Wedding Reception) వేడుక అట్టహాసంగా నిన్న రాత్రి జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న వరలక్ష్మి..ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ తో ఏడు అడుగులు వేసింది. జులై 02 న థాయ్ల్యాండ్ లో వీరి వివాహం జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ..కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్ళికి చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మార్చి 1 న వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి వేడుకను సింపుల్ గా జరుపుకోవాలని డిసైడ్ అయినా ఈమె..అలాగే జరుపుకుంది. కానీ రిసెప్షన్ ను మాత్రం చెన్నైలో గ్రాండ్ గా చేసుకుంది. వెడ్డింగ్ రిసెప్షన్‌ లో సెలబ్రిటీస్, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ , నందమూరి బాలకృష్ణ , వెంకటేష్ , రజనీకాంత్ , హీరో సిద్దార్థ్ , సందీప్ కిషన్ , కుష్భు తదితరులు హాజరై సందడి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read Also : Kalki 2 : 2025 సమ్మర్ కి రిలీజ్ సాధ్యమేనా..?