Varalaxmi Sarathkumar : సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటి ‘వరలక్ష్మి’. తమిళ్, తెలుగు భాషలతో పాటు ఇతర పరిశ్రమల్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటూ స్టార్ యాక్ట్రెస్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఇక ప్రొఫిషినల్ కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉన్న వరలక్ష్మి.. పర్సనల్ కెరీర్ ని కూడా ముందుకు తీసుకు వెళ్లేందుకు పెళ్లిపీటలు ఎక్కేసారు.
ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలాయ్ సచ్‌దేవ్ ని ప్రేమించిన వరలక్ష్మి.. మార్చి 1న అతడితో నిశ్చితార్థం జరుపుకొని అందరికి పరిచయం చేసారు. ఇక ఈ బుధవారం (జులై 10) థాయ్‌లాండ్‌లోని ఓ బీచ్ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మాత్రమే హాజరయ్యారు. ఇక పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వరలక్ష్మి, నికోలాయ్ ప్రేమ విషయానికి వస్తే.. 14 ఏళ్ల క్రితం ఒకరికొకరు పరిచయం అయ్యారట. అయితే నికోలాయ్ కి అప్పటికే పెళ్లి అయ్యి, ఒక కూతురు కూడా ఉందట. కానీ నికోలాయ్ తన మొదటి భార్య నుంచి విడిపోయారు. ఆ తరువాత వరలక్ష్మితో ఏర్పడిన స్నేహం ప్రేమగా మరి నేడు పెళ్లి వరకు వచ్చింది. నికోలాయ్ రెండో పెళ్లి గురించి వరలక్ష్మి గతంలో మాట్లాడుతూ.. “నా దృష్టిలో రెండో పెళ్లి తప్పేమి కాదు. నికోలయ్ మొదటి పెళ్లి గురించి చాలామంది విమర్శిస్తున్నారు. అయితే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. అతడు చాలా మంచి వ్యక్తి. అతని మనసు చూసే నేను ప్రేమించాను” అంటూ చెప్పుకొచ్చారు.