శరత్ కుమార్ కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar). హీరోయిన్ గా పలు సినిమాలు చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, విలన్ పాత్రలు చేస్తూ బిజీ అయిపొయింది. పదేళ్లలోనే 50 సినిమాలు చేసేసి , చేతిలో ఇంకో డజన్ సినిమాలు అన్ని భాషల నుంచి ఆఫర్స్ పెట్టుకొని బిజీబిజీగా ఉంది వరలక్ష్మి.
త్వరలో కోటబొమ్మాళి PS(Kotabommali PS) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది వరలక్ష్మి శరత్ కుమార్. మలయాళం సినిమా నాయట్టుకి రీమేక్ గా శ్రీకాంత్, వరలక్ష్మి విజయ్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో కోటబొమ్మాళి PS సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నవంబర్ 24న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమాలోని ఓ సన్నివేశంలో బాగా ఇబ్బంది పడ్డారని అన్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా విషయంలో నాకు సవాల్ అనిపించింది ఒక్కటే. ఈ సినిమా కోసం నేను తొలిసారి సిగరెట్ కాల్చాను. నేను ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా సిగరెట్ కాల్చలేదు. బయట కూడా కాల్చను. కానీ ఈ సినిమా కోసం సిగరెట్ కాల్చాల్సి వచ్చింది. పాత్ర డిమాండ్ మేరకే అలా నటించాల్సి వచ్చింది. దానివల్ల చాలానే ఇబ్బంది పడ్డాను అని తెలిపింది.
Also Read : Alia Bhatt : ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై స్పందించిన అలియా భట్..