Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ మంచివాడు కాదా.. నటి వరలక్ష్మి వైరల్ కామెంట్స్..

Varalaxmi Sarathkumar Sensational Comments About Prabhas In Sabari Movie Promotions

Varalaxmi Sarathkumar Sensational Comments About Prabhas In Sabari Movie Promotions

Prabhas – Varalaxmi Sarathkumar : టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక పక్క బలమైన సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో కూడా ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ నటి ‘శబరి’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటించారు. ఈ సినిమా మే 3న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న వరలక్ష్మి.. పలు ప్రెస్ మీట్స్ అండ్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొనగా వరలక్ష్మికి డిఫరెంట్ క్యూస్షన్ ఎదురైంది. వరలక్ష్మి ఇటీవలే తన ప్రియుడు ‘నికోలయ్’తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను వరలక్ష్మి సోషల్ మీడియాలో కూడా షేర్ చేసారు. నికోలయ్ చూడడానికి బాడీ బిల్డర్‌గా కండలతో, ఎత్తుగా కనిపిస్తున్నారు. ఈ విషయం గురించే ప్రశ్నిస్తూ.. “ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. బాడీ ఉన్నోడికి హార్ట్ ఉండదని చెబుతారు. అలాంటిది మీరు బాడీ ఉన్న వ్యక్తిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్నారు. అతనిలో మీరు ఏ క్వాలిటీ చూసి ప్రేమించారు..?” అని ప్రశించాడు.

దీనికి వరలక్ష్మి బదులిస్తూ.. “బాడీ ఉంటే హార్ట్ ఉండదని ఎవరు చెప్పారు. ప్రభాస్ గారు ఉన్నారు. ఆయనికి ఎంత బాడీ ఉంది. మరి ఆయన మంచి వారు కాదా. ఏంటండీ ఆ లాజిక్. ఇక క్వాలిటీస్ చూసి ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది. ప్రేమ అనేది చూడగానే ఒక మ్యాజిక్ లా పుడుతుంది. అంతేతప్ప మనకి నచ్చిన లక్షణాలు అన్ని కనిపించిన తరువాత ప్రేమ పుట్టదు. నికోలయ్ ని చూసాను, ప్రేమ కలిగింది, ప్రేమించాను, అంతేతప్ప నాకు నచ్చిన లక్షణాలు వెతుకొని ప్రేమించలేదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Pushpa 2 : పుష్ప 2 మొదటి సాంగ్ వచ్చేసింది.. అసలు తగ్గేదేలే..