కోలీవుడ్ నుంచి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sharathkumar) టాలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగిస్తుంది. సినిమాలో సపోర్టింగ్ రోల్స్ తో ఆమె స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. క్రాక్, వీర సింహా రెడ్డి సినిమాలు హిట్ పడటంతో వరలక్ష్మికి తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. లేటెస్ట్ గా మరో మెగా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న మెగా మూవీ విశ్వంభర సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా హనుమాన్ ఈవెంట్ లో పాల్గొన్న చిరు వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆమెను పొగిడారు. ఆ టైం లోనే ఆమెను తన సినిమాలో ఒక భాగం చేయాలని అనుకున్నారనుకుంటా. అందుకే వరలక్ష్మిని ప్రశంసలతో ముంచెత్తారు చిరంజీవి.
ఇక చిరు సినిమాలో ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఎవరైనా ఇతర భాషల నుంచి వచ్చి హీరోయిన్ గా రాణిస్తారు కానీ వరలక్ష్మి మాత్రం కోలీవుడ్ నుంచి వచ్చి స్పెషల్ రోల్స్ తో ఆకట్టుకుంటుంది. తెలుగు ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ఈ అభిమానికి వరలక్ష్మి శరత్ కుమార్ చాలా ఆనందంగా ఉంది. మరి మెగాస్టార్ విశ్వంభర సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఎలా తన మార్క్ చాటుతుందో చూడాలి.
Also Read : Nagarjuna : ఫ్యాన్స్ నవ్వే నా ధైర్యం.. మళ్లీ వచ్చే సంక్రాంతికి కలుద్దాం అంటున్న నాగార్జున..!