Site icon HashtagU Telugu

Varalakshmi Sharath Kumar Engaged : సీక్రెట్ ఎంగేజ్ మెంట్ తో షాక్ ఇచ్చిన వరలక్ష్మి.. వరుడు ఎవరో తెలుసా..?

Varalakshmi Sharath Kumar Engaged With Nicolai Sachdev

Varalakshmi Sharath Kumar Engaged With Nicolai Sachdev

Varalakshmi Sharath Kumar Engaged కోలీవుడ్ భామ వరలక్ష్మి శరత్ కుమార్ తన సీక్రెట్ ఎంగేజ్ మెంట్ తో షాక్ ఇచ్చింది. కొన్నాళ్లుగా తన పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తున్నా వాటిని ఖండిస్తూ వచ్చింది వరలక్ష్మి. అప్పట్లో తమిళ హీరో విశాల్ తో లవ్ స్టోరీ నడిపించిన వరలక్ష్మి అతనితో పెళ్లికి రెడీ అవగా శరత్ కుమార్ వారి పెళ్లికి అడ్డు పడ్డాడు. ఆ తర్వాత వరలక్ష్మి పెళ్లంటూ ఎవరి ఎవరి పేర్లో వినిపించాయి.

ఇక ఈమధ్య కెరీర్ పరంగా బిజీ అవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది. తెలుగులో క్రాక్ సినిమా నుంచి రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ వరకు వరలక్ష్మి చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఇదిలాఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ జరుపుకుంది. గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ ని మార్చి 1న ఎంగేజ్ చేసుకుంది వరలక్ష్మి.

సినీ పరిశ్రమకు సంబంధం లేకుండా బయట వ్యక్తిని పెళ్లాడుతుంది వరలక్ష్మి. 14 ఏళ్లుగా సచ్ దేవ్ తో పరిచయం ఉందని అదే ప్రేమగా మారి పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కూడా కేవలం కొద్దిమంది అతిథులతోనే జరిపినట్టు తెలుస్తుంది.A

Also Read : Premalu Telugu Trailer : ప్రేమలు తెలుగు ట్రైలర్.. తొక్కుకుంటూ పోవాలే అంటున్నారుగా..!