Site icon HashtagU Telugu

Varalakshmi Sharath Kumar : వరలక్ష్మి శరత్ కుమార్ డిమాండ్ అలా ఉంది.. రెమ్యునరేషన్ షాక్..!

Varalakshmi Drugs Case

Varalakshmi Drugs Case

Varalakshmi Sharath Kumar కోలీవుడ్ లో ముందు హీరోయిన్ గా ట్రై చేసి ఆ తర్వాత విలక్షణ పాత్రలు చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో మాత్రం ఆమె చేసిన ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత క్రాక్, వీర సిం హా రెడ్డి, హనుమాన్ సినిమాలతో హిట్ అందుకుంది. ప్రతి సంక్రాంతికి ఆమె సినిమా రావడం అది హిట్ కొట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ డిమాండ్ భారీగా పెరిగింది.

We’re now on WhatsApp : Click to Join

వరలక్ష్మి కి తెలుగులో ఉన్న డిమాండ్ దృష్ట్యా అమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది. మొన్నటిదాకా సినిమాకు 50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు కోటి డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. వరలక్ష్మి సినిమాలో ఉంటే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఏర్పడింది. ముఖ్యంగా డిఫరెంట్ సినిమాల్లో వరలక్ష్మి ఉంది అంటే సినిమా సక్సెస్ అన్నట్టే లెక్క.

హనుమాన్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తన సత్తా చాటింది. ఇచ్చిన పాత్రలో ఆమె పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది. అందుకే వరలక్ష్మికి ఇంకా ఇంకా ఛాన్సులు వస్తున్నాయి. వరలక్ష్మి కూడా డిఫరెంట్ రోల్స్ తో ప్రేక్షకులను అలరించాలని అనుకుంటుంది. హీరోయిన్ గా చేసిన వారికి ఈక్వల్ గా ఆమె అదరగొట్టేస్తుంది. డిమాండ్ లోనూ వరలక్ష్మి తన సత్తా చాటుతుంది.

కోలీవుడ్ లో కన్నా వరలక్ష్మి తెలుగులో తన పాపులారిటీ సంపాధించింది. తమిళంలో అమ్మడు సినిమాలు చేస్తున్నా సరే తెలుగులో ఆమె చేస్తున్న పాత్రలకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే టాలీవుడ్ లో సినిమా సినిమాకు వరలక్ష్మి క్రేజ్ డబుల్ అవుతుంది. హనుమాన్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా మరిన్ని ఛాన్సులు అందుకుంటుందని చెప్పొచ్చు.

Also Read : Lunch Party for Bigg Boss Contestents : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి స్టార్ హీరో విందు భోజనం..!

ఎక్కడ క్రేజ్ ఉంటే అక్కడ పాగా వేయడం సినిమా వాళ్లకు అలవాటే. ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన డిమాండ్ కి తగినట్టుగా తెలుగులో టాప్ లేపేస్తుంది. ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో నాయం చేస్తూ సినిమా హిట్ లో భాగం అవుతుంది. కచ్చితంగా అమ్మడు టాలీవుడ్ లో పెద్ద ప్లానింగ్ తోనే ఇలాంటి పాత్రలు చేస్తుందని చెప్పొచ్చు. తెలుగులో శరత్ కుమార్ సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ వరలక్ష్మి మాత్రం ఇక్కడ తండ్రిని మించిన క్రేజ్ తెచ్చుకుంటుంది.