Site icon HashtagU Telugu

Varalaxmi Sarathkumar : డ్రగ్స్ కేసులో అరెస్ట్ ఫై స్పందించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌..

Varalaxmi Sarathkumar Drugs

Varalaxmi Sarathkumar Drugs

డ్రగ్స్ కేసు (Drug Case)లో హనుమాన్ ఫేమ్ వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar Arrest) అరెస్ట్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడం తో దీనిపై వరలక్ష్మి స్పందించింది. అవన్నీ పుకార్లే అని..కొంతమంది వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్ అనే మాట వినిపిస్తే ముందుగా చిత్రసీమ ఫై కన్నేస్తారు. ఎందుకంటే సినీ ప్రముఖులే డ్రగ్స్ ను ఎక్కువగా వాడుతుంటారని ఎప్పటినుండో ఓ పేరు పడింది. దీంతో ఎక్కడ డ్రగ్స్ దొరికిన ముందుగా అరా తీసేది చిత్రసీమ ప్రముఖుల గురించే.

ఇటీవల టాలీవుడ్ చిత్రసీమ కు సంబదించిన కొంతమంది పేర్లు డ్రగ్స్ కేసులో వెలుగులోకి రావడం తో పోలీసులు వాటిపై ఆరా తీస్తున్నారు. ఇదే అదును చేసుకొని కొంతమంది ఫేక్ రాయుళ్లు డ్రగ్స్ కేసులో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) అరెస్ట్ అయ్యిందంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. రోజు రోజుకు ఈ ప్రచారం ఎక్కువై పోతుండడం తో వరలక్ష్మి ఈ వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు రేటింగ్ కోసం ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు జర్నలిజం విలువను కాపాడాలంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.

‘డ్రగ్స్‌ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సమన్లు, లేదా ఫోన్‌ కాల్స్‌ రాలేదు. నా ఫొటో ఉపయోగించి ‘వరలక్ష్మి మేనేజర్‌కు నోటీసులు’ అంటూ వార్తలు రాస్తున్నారు. మంచి వార్తలు దొరకకపోవడంతో పలు మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం నిజంగా బాధాకరం. విలేకర్లు, వెబ్‌సైట్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. అసలైన జర్నలిజాన్ని కాపాడండి. నిజాలు రాయండి. ప్రముఖులు, సెలబ్రిటీల లోపాలు వెతకడం మానుకోండి. సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించేందుకు మేము చాలా కష్టపడుతున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. మీ పని మీరెందుకు చేయడం లేదు. సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటిపై దృష్టి పెట్టండి. మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపండి. పరువునష్టం కేసులు కూడా ట్రెండింగ్‌ అవుతున్నాయి’ అంటూ హెచ్చరించారు.

ఇదిలా ఉంటె అతి త్వరలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబైకు చెందిన పారిశ్రామికవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ను పెళ్ళి చేసుకోనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం రీసెంట్ గాముంబై నగరంలో ఇరు కుటుంబాల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. వీరిద్దరూ 14 ఏళ్ళుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఎట్టకేలకు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు.


.