తమిళ నటి వనిత విజయకుమార్ (Vanitha Vijayakumar) నాలుగో పెళ్లి ( 4th wedding)కి సిద్ధమైంది. కొన్నాళ్ల క్రితం ఈ విషయమై రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అవి నిజమని తేలిపోయాయి. చాలాకాలం నుంచి తనకు తెలిసిన రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్‌తోనే ఏడడుగులు వేయబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే ప్రకటించింది. 1995లో ‘చంద్రలేఖ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వనిత. సినిమాలతో కన్నా వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అయ్యింది. 2000లో నటుడు ఆకాశ్‌ని పెళ్లి చేసుకోగా కొడుకు, కూతురు పుట్టారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు.
2007లో ఆనంద్ జయదర్శన్ అనే వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది వనిత. వీళ్లకు కూతురు పుట్టింది. ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో ఇతడి నుంచి కూడా విడాకులు తీసుకుంది. 2020లో ఫొటోగ్రాఫర్ పీటర్ పాల్‌ని మూడో పెళ్లి చేసుకుంది. కేవలం నాలుగు నెలల్లోనే విడాకులు తీసుకుంది. అయితే ఆయనతో తన పెళ్లి జరగలేదని, ఎంగేజ్‌మెంట్ మాత్రమే జరిగిందని వనిత అప్పట్లో వివరణ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమైంది. కొరియోగ్రాఫర్ రాబర్ట్ ను పెళ్లి చేసుకోనుంది.
అక్టోబర్ 05 న వీరిద్దరూ ఒకటికాబోతున్నారు. ప్రస్తుతం వనిత వయసు 43 ఏళ్లు. ఈమె కూతురు జోవిక కూడా బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పోటీ పడింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు పోటీ పడుతుంది. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచినా వనిత..నాల్గో పెళ్లితో ఫుల్ స్టాప్ పెడుతుందా..? ఇతడికి కూడా విడాకులు ఇస్తుందా..? అని అంత మాట్లాడుకుంటున్నారు. చిత్రసీమ లో పెళ్లిళ్లు..విడాకులు అనేవి కామన్ అని వారికీ పెళ్లి అనే బంధం గురించి తెలియదంటూ నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.
Read Also : Gambhir Vision: స్కెచ్ అదిరింది.. రిజల్ట్ వచ్చింది, గంభీర్ మార్క్ షురూ!