Site icon HashtagU Telugu

Bigg Boss Tamil : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫై దాడి ..

Vanithavijaykumar

Vanithavijaykumar

నార్త్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ (Bigg Boss) షో..సౌత్ లోను మంచి ఆదరణతో రాణిస్తుంది. తాజాగా తమిళ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫై దాడి జరగడం వైరల్ గా మారింది. తమిళ్ లో సీజన్ 7 నడుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గొడవలు , అరుచుకోవడం , ప్రేమలు , సంతోషాలు ఇలా అన్ని ఉంటాయి.

తాజాగా ఎలిమినేట్ అయిన వనిత విజయ్ కుమార్ (Vanitha Vijay Kumar) పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక యూట్యూబ్ లో వనిత రివ్యూ ఇస్తోంది. శనివారం రాత్రి కూడా ఇలాగే రివ్యూ ఇచ్చి, డిన్నర్ చేసి ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై దాడికి దిగాడు. దీంతో వనిత ముఖంపై గాయమైంది. ఈ విషయాన్ని వనిత సోషల్ మీడియాలో పంచుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

నా మీద జరిగిన దారుణమైన దాడి గురించి ధైర్యంగా పోస్ట్ వేస్తున్నా.. బిగ్ బాస్ షో అనేది కేవలం ఆట.. ఇలా మీరు దాడి చేయడం, హింసను సృష్టించడం సరైన పద్దతి కాదు అంటూ వనిత పోస్ట్ వేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రదీప్ (Bigg Boss Pradeep) ఫ్యాన్స్ ఇలా చేసి ఉంటారు అని కొంత మంది కామెంట్స్ చేస్తుంటే.. వాళ్లే చేసి ఉంటారని ఎలా చెప్పగలరు.. ఆమెకు ప్రపంచంలో ఎంతో మందితో గొడవలున్నాయి..ఎవరు ఆమె మీద దాడి చేశారో.. మీరు ఎలా చెప్పగలరు అంటూ మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.

Read Also : India Head Coach: భారత జట్టుకు కొత్త కోచ్.. భారతీయుడు కాదు విదేశీ ఆటగాడు..?!