Site icon HashtagU Telugu

Vakeel Saab : ఎన్నికల సమయంలో పవన్ మూవీ రీ రిలీజ్..ఏపీలో మరో జాతరే..

Vakeel Saabh Re Release

Vakeel Saabh Re Release

ఏపీలో ఎన్నికల (AP Elections) వేడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడించాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. భారీగా డబ్బు , మద్యాన్ని సిద్ధం చేసి..వాటితో పవన్ గెలుపును అడ్డుకోవాలని చూస్తుంది. కానీ జనసేన , టీడీపీ శ్రేణులు మాత్రం వైసీపీ వ్యూహాలను తిప్పికొడుతున్నారు. నిన్న దాదాపు రూ.80 లక్షల విలువైన మద్యాన్ని అధికారులకు పట్టించి వైసీపీ కి భారీ షాక్ ఇచ్చారు. ఇటు సినీ ప్రముఖులంతా పవన్ కోసం పిఠాపురం కు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు వెండితెర , బుల్లితెర నటి నటులు పెద్ద ఎత్తున వారం రోజులుగా పిఠాపురంలో ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతూ వస్తున్నారు. ఈ ప్రచారంతో అభిమానుల్లో జోష్ పెరుగుతుంది. ఈ క్రమంలో మరో గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు టాప్ హీరోలు నటించిన ఎవర్ గ్రీన్ మూవీస్ రీ రిలీజ్ అవుతూ అభిమానుల్లో ఉత్సహం నింపుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ( Vakeel Saab) మూవీ మే 1 న రీ రిలీజ్ కాబోతుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో పవన్ రీఎంట్రీ మూవీ గా 2021, ఏప్రిల్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రంలో పవన్​ లాయ‌ర్​గా న‌టించి అదరగొట్టాడు. అనన్య నాగళ్ల, అంజలి నివేద థామస్, శ్రుతిహాసన్ ఇతర పాత్రల్లో నటించారు. వెంక‌టేశ్వ‌ర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. ఇప్పుడీ చిత్రం.. మే 1న రీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ అఫీషియల్​గా అనౌన్స్​మెంట్ చేసింది. గతంలో ఈ సినిమాను జగన్ సర్కార్ అడ్డుకోవాలని చూసింది..రిలీజ్ టైములో అనేక కండీషనలు పెట్టింది..టికెట్ రేట్లను సైతం భారీగా తగ్గించింది. రూ.5 , రూ.10 గా వకీల్ సాబ్ టికెట్ ధరలు నిర్ణయించిందంటే అంతకన్నా దారుణం మరోటి ఉండదు. మరి ఇప్పడు ఎన్నికల సమయంలో మరోసారి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ జాతర ఎలా ఉండబోతుందో చూడాలి.

Read Also : UP University: ఆన్స‌ర్ షీట్‌లో జై శ్రీరామ్, విరాట్ కోహ్లీ పేరు.. న‌లుగురు విద్యార్థులు పాస్‌..!