మొన్నటిదాకా యూట్యూబ్ హీరోయిన్ గా సత్తా చాటిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) బేబీ సినిమాతో హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. అంతకుముందు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో కనిపించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో హీరోయిన్ గా చేసిన మొదటి అటెంప్ట్ తోనే వావ్ అనిపించింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని సీన్స్ లో తన నటనతో ఆడియన్స్ ని మెప్పించింది అమ్మడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లకు ఈక్వల్ గా తన పర్ఫార్మెన్స్ తో అలరించింది వైష్ణవి.
బేబీ సినిమా హిట్ లో ప్రధాన కారణంగా మారిన వైష్ణవికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బేబీ వైష్ణవి తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తుంది. బేబీకి చాలా తక్కువ పారితోషికం తీసుకోగా ఆ తర్వాత చేస్తున్న సినిమాలకు మాత్రం అమ్మడు భారీగానే డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.
Also Read : Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ వార్తలపై స్టార్ సింగర్ రియాక్షన్ ఇదే
ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో వైష్ణవిని హీరోయిన్ గా తీసుకోగా ఆ సినిమా కోసం ఆమెకు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు హీరోయిన్ కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకున్నది చాలా అరుదు. ఈమధ్య కాలంలో తెలుగు హీరోయిన్స్ ఎవరు ఈ క్రేజ్ దక్కించుకోలేదు. వైష్ణవికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా దిల్ రాజు ఆమెకు కోటి ఆఫర్ ఇచ్చారట.
ఆశిష్ హీరోగా దర్శకుడు అరుణ్ డైరెక్షన్ లో తేకెక్కే సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవబోతుంది. సినిమాలో వైష్ణవి పాత్ర కూడా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. రౌడీ బోయ్ తర్వాత సెల్ఫిష్ సినిమా చేస్తున్న ఆశిష్ తన థర్డ్ సినిమా వైష్ణవితో జత కడుతున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
We’re now on WhatsApp : Click to Join