Site icon HashtagU Telugu

Vaishnavi Chaitanya : స్పిరిట్ లో బేబీ.. అంతకుమించిన అదృష్టమా..?

Vaishnavi Chaitanya Career risk with Love me Result

Vaishnavi Chaitanya Career risk with Love me Result

Vaishnavi Chaitanya యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ తో పాపులర్ అయ్యి ఆ తర్వాత వెబ్ సీరీస్ లతో మెప్పించిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేసిన తొలి సినిమా బేబీతో సూపర్ హిట్ అందుకుంది. బేబీ సినిమాలోని ఆ పాత్రకు వైష్ణవి తన అభినయంతో మెప్పించింది. హీరోయిన్ గా చేసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్యకు తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. బేబీ తర్వాత వైష్ణవికి వర్సూ అవకాశాలు వస్తున్నాయి.

ఆశిష్ రెడ్డితో లవ్ మీ మూవీ చేసిన వైష్ణవి సిద్ధు జొన్నలద్గడ్డ తో జాక్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. లవ్ మీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పిరిట్ లో మీరు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. వాటిల్లో నిజం ఉందా అని రిపోర్టర్ అడిగితే లేదని చెప్పింది. అల వైకుంథపురములో సినిమాలో అల్లు అర్జున్ కి సిస్టర్ గా చేసింది వైష్ణవి. మళ్లీ అలాంటి ఛాన్స్ వస్తే చేస్తా అంటుంది అమ్మడు.

అంతేకాదు స్పిరిట్ లో హీరోయిన్ గా కాదు జస్ట్ చిన్న రోల్ వచ్చినా చేస్తా అంటుంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ చెల్లి పాత్రలో వచ్చినా సరే తాను ఒప్పుకుంటా అంటుంది అమ్మడు. బేబీ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య రాబోయే సినిమాలతో అలరించాలని చూస్తుంది. అంతేకాదు ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో కూడా నటించాలని ఉందని చెప్పింది వైష్ణవి. వైష్ణవి చైతన్య ఫాం చూస్తుంటే తెలుగు అమ్మాయి తెలుగులో టాప్ రేంజ్ వెళ్లేలా ఉందని చెప్పొచ్చు.

Also Read : AR Rahaman : చరణ్ సినిమా కోసం సెంటిమెంట్ బ్రేక్ చేసిన రెహమాన్.. బుచ్చి బాబు ప్లానింగ్ అంటే అలానే ఉంటుందిగా..!