Vaishnav Tej : వైష్ణవ్ తేజ్ తేజ్.. వచ్చాడయ్యో సామి..!

సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా సూపర్ స్టార్ మహేష్ (Super Star Mahesh) పాటని పెడుతున్నారని

Published By: HashtagU Telugu Desk
Vaishnav Tej Vacchadayyo Sami

Vaishnav Tej Vacchadayyo Sami

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెరంగేట్రం తోనే సూపర్ హిట్ అందుకున్నాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి క్రేజీ ఛాన్సులు అందుకుంది. ఐతే వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో హిట్ అందుకున్నా సరే ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ నిరాశ పరచాయి. కనీసం ఒక్కటంటే ఒక్క హిట్ దక్కలేదు. చివరగా వచ్చిన ఆదికేశవ అయితే ఇలా వచ్చింది అలా వెళ్లింది.

అందుకే కథల విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్న వైష్ణవ్ తేజ్ ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ తో వస్తున్నాడని తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా సూపర్ స్టార్ మహేష్ (Super Star Mahesh) పాటని పెడుతున్నారని తెలుస్తుంది.

మహేష్ భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో సామి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా సాంగ్ ని టైటిల్ గా పెట్టేస్తున్నారని తెలుస్తుంది. కృష్ణ చైతన్య చివగా విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godhavari) సినిమా చేశాడు.

విశ్వక్ సేన్ తోనే మరో సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నా కూడా సడెన్ గా వైష్ణవ్ తేజ్ (Vaishna Tej) తో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది చూడాలి. సినిమా టైటిల్ తో మహేష్ ఫ్యాన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. మరి మెగా హీరో ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

  Last Updated: 04 Sep 2024, 10:44 PM IST