Site icon HashtagU Telugu

Adikeshava Block Buster Rating : ఆ డిజాస్టర్ సినిమాకు బుల్లితెర మీద బ్లాక్ బాస్టర్ రేటింగ్..!

Vaishnav Tej Srileela Adikeshava Block Buster Rating In Small Screen

Vaishnav Tej Srileela Adikeshava Block Buster Rating In Small Screen

Adikeshava Block Buster Rating సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ హిట్ అయిన సినిమాలు బుల్లితెర మీద కూడా అదే రికార్డులను సృష్టిస్తాయి. కానీ కొన్ని కొన్ని సార్లు థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా స్మాల్ స్క్రీన్ పై అద్భుతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలు ధియేటర్ వర్షన్ బుల్లితెర మీద రికార్డు రేటింగ్ తెచ్చుకున్నాయి.

ఇప్పుడు ఇదే బాటలో మరో మెగా హీరో సినిమా బుడుతెర మీద షాకింగ్ రేటింగ్ తెచ్చుకుంది. ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ శ్రీ లీల జంటగా నటించిన సినిమా ఆదికేశవ. శ్రీకాంత్ రెడ్డి డైరెక్టర్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. లో బడ్జెట్ లో మంచి క్వాలిటీ ఉన్న సినిమాలు తీస్తున్న ఈ బ్యానర్ నుండి ఆదికేశవ లాంటి డిజాస్టర్ వస్తుందని ఆడియన్స్ ఊహించలేదు. రొటీన్ రెగ్యులర్ మాస్ మసాలా సినిమాగా ఆదికేశవ ప్రేక్షకుల మెప్పు పొందలేదు. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ లో కూడా ప్రభావం చూపించలేదు. కానీ అనూహ్యంగా బుల్లితెర మీద ఈ సినిమాకు అదిరిపోయే రేటింగ్ వచ్చింది.

రీసెంట్గా వాడు ప్రీమియర్ గా స్మాల్ స్క్రీన్ పై వచ్చిన ఆదికేశవ అర్బన్ టిఆర్పి రేటింగ్ గా 10.47 తెచ్చుకుంది. రూరల్ కూడా కలిపితే యావరేజ్ గా 9.87 రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక ఫ్లాప్ సినిమాకి ఈ రేంజ్ రేటింగ్ రావడం రికార్డ్ అని చెప్పొచ్చు. థియేటర్లో సినిమాలు చూడని ఆడియన్స్ ఆదికేశవని బుల్లితెర మీద ఆదరించారు. వైష్ణవ్ తేజ్ శ్రీ లీల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఆదికేశవ స్మాల్ స్క్రీన్ మై ఈ రేంజ్ రేటింగ్ తెచ్చుకుంటుందని ఎవరు ఊహించలేదు. చిత్ర యూనిట్ కి బుల్లితెర మీద ఆది కేశవ రేటింగ్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.