Site icon HashtagU Telugu

Vaddepalli Krishna : సినీగేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత..

Vaddepalli Krishna Passed A

Vaddepalli Krishna Passed A

Vaddepalli Krishna Passed Away : ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ (Vaddepalli Krishna) (76) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన..హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ (Nims Hospital) లో చికిత్స (Treatment)) పొందుతూ..ఈరోజు ఉదయం కన్నుమూశారు. 1948, ఆగస్టు 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల లో చేనేత వృత్తిగా కలిగిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు లక్ష్మమ్మ, లింగయ్య. కృష్ణ బాల్యం నుండే సినారె స్ఫూర్తితో సాహిత్యం పట్ల ఎక్కువ అభిరుచి కలిగినవారు.

‘ఎక్కడికెళ్తుందో మనస్సు’ మూవీ కి డైరెక్షన్

లలిత గీత రచయితగా, ప్రామాణిక పరిశోధకుడిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గీత రచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలు, ఆడియో ఆల్బమ్స్ రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా విభిన్న కోణాల్లో వడ్డేపల్లి కృష్ణ సాహిత్య సేవలు అందించారు. అలాగే డైరెక్షన్ ఫై మక్కువ తో ‘ఎక్కడికెళ్తుందో మనస్సు’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించాడు. అంతరించి పోతున్న గోవులపై గోభాగ్యం అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో బహుమతులు గెలుచుకుంది. బతుకమ్మ, ఆత్మహత్య, నేతన్నలు వంటి డాక్యుమెంటరీలను తీసి జాతీయస్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నాడు. టెలివిజన్‌లో భక్త కవి పోతన, భారతీయ సంస్కృతీ శిఖరాలు వంటి సీరియల్స్‌ను డైరెక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కృష్ణ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు గేయ రచయితలు సంతాపం తెలియజేస్తున్నారు.

Read Also : Narendra Modi : సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ