Site icon HashtagU Telugu

Bhagavanth Kesari: ‘భగవంత్‌ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలా వీడియో సాంగ్ రిలీజ్

Balakrishna NBK 108 Movie Title announced as Bhagavanth Kesari

Balakrishna NBK 108 Movie Title announced as Bhagavanth Kesari

Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్‌ సూపర్‌హిట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీలీల (sreeleela) కీలక పాత్ర పోషించారు. ఆసక్తికర అంశంతో సిద్ధమైన ఈ చిత్రంలోని ‘ఉయ్యాలో ఉయ్యాలా’ పాట ప్రేక్షకుల మనసును హత్తుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పాట ఫుల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి (BobbyKolli) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఎలా వస్తోంది, ఎలా జరుగుతోంది అనే విషయాలపై బాలయ్య అభిమానులు ఇప్పట్నుంచే ఆసక్తి చూపుతున్నారు. అలాగే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (NandamuriMokshagna) కూడా త్వరలోనే ఆరంగేట్రం చేయనున్నాడని బాలయ్య అభిమానులు చర్చించుకుంటుండగా, హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version