Site icon HashtagU Telugu

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ టాక్ – గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం

Usthad Teaser

Usthad Teaser

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు అసలైన పండగ తీసుకొచ్చారు హరీష్ శంకర్ (Harish Shankar). పవన్ లాంటి స్టార్ హీరోకు ఎలాంటి డైలాగ్స్ పలికించాలో హరీష్ శంకర్ కు బాగా తెలుసు..గబ్బర్ సింగ్ లో ఏ రేంజ్ లో బులెట్ లాంటి డైలాగ్స్ పేల్చారో..ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా అంతకు మించి పలికించారని ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh ) టీజర్ చెప్పకనే చెప్పింది.

We’re now on WhatsApp. Click to Join.

పవన్ కళ్యాణ్ – శ్రీలీల జంటగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ – హరీష్ శంకర్ ల కలయికలో రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయ్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల మూడ్ లో ఉండడం తో సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఎన్నికలు పూర్తి అవ్వగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమములో సినిమా నుండి అసలైన టీజర్ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

టీజర్ చూస్తుంటే..ఎన్నికల ప్రచారం కోసమే ఈ టీజర్ ను రిలీజ్ చేసినట్లు ఉందని ప్రతి ఒక్కరికి అనిపించకుండా ఉండదు. ఎందుకంటే మొత్తం గాజు గ్లాస్ చుట్టే టీజర్ సాగింది. టీజర్ స్టార్టింగ్ లో పవన్ లుంగీ తో మాస్ ఎంట్రీ ఇచ్చాడు..ఆ తర్వాత గన్ తో కాలుస్తూ గుండాలను పరుగులుపెట్టించాడు. నీ రేంజ్ ఇది అంటూ విలన్ టీ గాజు గ్లాస్ ను కిందపడేస్తాడు..గాజు పగిలే కొద్దీ పదునుకుద్ది..ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం..కనిపించని సైన్యం అంటూ జనసేన సైనికుల గురించి చెప్పకనే చెప్పాడు. ఓవరాల్ గా మాత్రం ఈ టీజర్ పవన్ అభిమానులకు , పార్ట్ శ్రేణుల్లో పూనకాలు తెప్పించింది. దీనిని ఎన్నికల ప్రచారం లో ఏ రేంజ్ లో వాడుకుంటారో చూడాలి.

Read Also : ‘Citadel: Honey Bunny’ : సమంత ‘సిటాడెల్’ టైటిల్ చేంజ్ ..