Site icon HashtagU Telugu

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ రానుంది. రేపు అంటే సెప్టెంబర్ 1 సాయంత్రం 4:45 గంటలకు ఒక ‘ఫుల్ మీల్స్’ అప్‌డేట్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నారు. అంతేకాకుండా త‌న త‌ల‌మీద ఉన్న టోపీని పైకి ఎత్తుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ పోజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో “రేపు సాయంత్రం 4:45కి ఫుల్ మీల్స్” అనే క్యాప్షన్ ఇవ్వడం, ఇది సినిమాలోని ఒక పెద్ద అప్‌డేట్ అని స్పష్టం చేస్తోంది. సినిమా నుండి ఒక టీజర్ లేదా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు.

Also Read: Bajaj Pulsar: బజాజ్ బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా పల్సర్.. మొత్తం అమ్మకాల్లో క్షీణత!

‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని పవన్ కళ్యాణ్ స్టైల్, యాటిట్యూడ్‌ను మళ్ళీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజకీయాలు, సినిమాలతో పవన్ బిజీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ.. తన సినిమా షూటింగ్‌లకు కూడా సమయం కేటాయిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి రాబోయే ప్రతి అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక రేపు సాయంత్రం 4:45 గంటలకు విడుదలయ్యే ఈ ‘ఫుల్ మీల్స్’ ఏంటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. ఈ అప్‌డేట్ సినిమా విడుదల తేదీపై లేదా ఒక ముఖ్యమైన టీజర్ అయి ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోస్టర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రెండింగ్‌లో ఉంది.