Ustaad Bhagat Singh : ఇంటర్వెల్ యాక్షన్ ను పూర్తి చేసిన ఉస్తాద్ భగత్ సింగ్

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన ప్రత్యేక సెట్‌లో యాక్షన్ సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. ఇది ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ అని తెలుస్తోంది

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Acion Shoot Started

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Acion Shoot Started

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఓ పక్క రాజకీయాలు , మరోపక్క సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు OG , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ రెండు సినిమాలను మరో రెండు నెలల్లో పూర్తి చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ రెండిటి షూటింగ్ లను సమాంతరంగా కొనసాగిస్తూ.. రాజకీయాలను కూడా అలాగే కొనసాగిస్తున్నాడు.

రీసెంట్ గా హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్ తాలూకా యాక్షన్ పార్ట్ ను పూర్తి చేశారు. హైదరాబాద్‌లో నిన్నటితో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేసిన ప్రత్యేక సెట్‌లో యాక్షన్ సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. ఇది ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ అని తెలుస్తోంది. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

ఇక ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాశ్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈరోజు నుండి వారాహి యాత్ర 4 వ షెడ్యూల్ మొదలైంది. కృష్ణా జిల్లాలో సుమారు ఐదు రోజుల పాటు వారాహి విజయ యాత్ర కొనసాగనుంది. నేడు అవనిగడ్డ లో భారీ సభ జరగనుంది. రేపుజనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై అర్జీలను జనసేనాని స్వీకరించనున్నారు. 4 వ తేదీన పెడన, 5వ తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

Read Also : Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా..?

  Last Updated: 01 Oct 2023, 05:03 PM IST