‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై నేటికి 11 ఏళ్ళు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) గ్లింప్స్ విడుదల చేయనున్నారు మూవీ టీం. సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ తన విలక్షణ శైలిలో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఈసారి వినోదం మాత్రమే కాదు’ అని కూడా పోస్టర్‌లో పేర్కొన్నారు.
ఈ చిత్రం భారీ అంచనాలతో రాబోతుందని తెలుస్తోంది. పోస్టర్ లో వెనుక ముస్లింలు నిలబడి ఉండటం సినిమా; మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గబ్బర్ సింగ్, హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతోంది. 4:59 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాబోతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Malli Pelli Trailer: నరేశ్, పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్.. బోల్డ్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్