Site icon HashtagU Telugu

Urvasi Rautela : ఊర్వశి కేవలం పాటకే కాదట.. బాలయ్య సినిమాలో అమ్మడు కెవ్వు కేక పెట్టిస్తుందా..?

Urvasi Rautela Speshal Cameo In Balakrishna Movie

Urvasi Rautela Speshal Cameo In Balakrishna Movie

బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతెలా (Urvasi Rautela) అక్కడ సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ తో కూడా అలరిస్తుంది. తెలుగులో కూడా ఈమధ్య స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో అలరించిన అమ్మడు. రాం స్కంద సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. అయితే బాస్ పార్టీ పర్వాలేదు అనిపించినా రాం సాంగ్ పెద్దగా క్లిక్ అవ్వలేదు.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఊర్వశి ప్రస్తుతం మరో తెలుగు సినిమా ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో కె ఎస్ బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ చేస్తుందట. ఈ సినిమాలో అమ్మడిని కేవలం సాంగ్ కోసమే అన్నట్టు కాకుండా ఒక క్యారెక్టర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఊర్వశి రౌతెల స్పెషల్ అప్పియరెన్స్ సినిమాకు స్పెషల్ క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. బీ టౌన్ లో తన అందాలతో అదిరిపోయే ట్రీట్ అందిస్తున్న ఊర్వశి బాలయ్య సినిమాతో కూడా తన మార్క్ చూపిస్తుందని అంటున్నారు. బాలయ్యతో సాంగ్ తోనే కాదు స్పెషల్ రోల్ తో కూడా మెప్పించాలని చూస్తున్న ఊర్వశి సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అవ్వాలని చూస్తుంది.

ఊర్వశి రౌతెల గ్లామర్ ట్రీట్ అంటే చాలు ఆడియన్స్ లో ఒకరమైన క్యూరియాసిటీ ఉంటుంది. తప్పకుండా ఈ సారి ఊర్వశి తన రేంజ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

Also Read : Soggadu Director : చిరు పొమ్మన్నాడు.. నాగ్ రమ్మంటాడా.. సోగ్గాడి పరిస్థితి ఇలా మారిపోయిందేంటి..?